రియల్ ఎస్టేట్ షాక్: 27.6 లక్షల మంది హోమ్‌బయ్యర్లు ప్రాజెక్టుల ఆలస్యంతో ఇబ్బందులు

HOME_BUYERS

దేశవ్యాప్తంగా 27.6 లక్షల మంది హోమ్‌బయ్యర్లు ఆలస్యమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్నారని ఫోరం ఫర్ పీపుల్స్ కలెక్టివ్ ఎఫర్ట్స్ (FPCE) నివేదిక వెల్లడించింది. వీరి సుమారు రూ.12.44 లక్షల కోట్ల పెట్టుబడులు నిలిచిపోయినట్లు తెలిపింది. RERA చట్టం అమల్లోకి వచ్చి పదేళ్లు పూర్తయిన సందర్భంగా విడుదలైన నివేదికలో, రాష్ట్రాలవారీగా RERA అమలులో లోపాలు ఉన్నాయని FPCE పేర్కొంది. ప్రాజెక్టుల ఆలస్యంతో ఇళ్ల కొనుగోలుదారులకు ఆర్థిక భారం పెరుగుతోందని తెలిపింది. హోమ్‌బయ్యర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కఠినమైన నియంత్రణ, వేగవంతమైన పరిష్కార వ్యవస్థ అవసరమని నివేదిక సూచించింది.

మరిన్ని సంబంధిత వార్తలు

Kishore Arepalli Avatar