లేటెస్ట్ సిటీ న్యూస్

  • హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా? సగటు విలువ రూ.2.03 కోట్లకు చేరిక!

    హైదరాబాద్‌లో ఇల్లు కొంటున్నారా? సగటు విలువ రూ.2.03 కోట్లకు చేరిక!

    హైదరాబాద్‌ హౌసింగ్ మార్కెట్‌లో అమ్మకాల కంటే ఇంటి విలువ పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 26,068 ఇళ్లు అమ్ముడవగా, మొత్తం విక్రయ విలువ రూ.52,913 కోట్లకు చేరింది. దీంతో సగటు ఇంటి విలువ రూ.2.03 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో కొత్తగా 49,656 ఇళ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. నార్త్‌వెస్ట్ హైదరాబాద్‌ 73% విక్రయ విలువతో ఆధిపత్యంలో ఉండగా, సౌత్‌వెస్ట్ వాటా నాలుగేళ్లలో 10% నుంచి 17%కి పెరిగింది. రాబోయే ఐదేళ్లలో కార్యాలయ స్థలాల విస్తరణ ఉద్యోగాలు, నివాస డిమాండ్‌ను పెంచే అవకాశం ఉంది.

    Kishore Arepalli Avatar

  • హైదరాబాద్‌ విల్లా మార్కెట్‌లో మారుతున్న ప్రాధాన్యతలు.. ‘ప్రైవసీ’కే పెద్దపీట!

    హైదరాబాద్‌ విల్లా మార్కెట్‌లో మారుతున్న ప్రాధాన్యతలు.. ‘ప్రైవసీ’కే పెద్దపీట!

    హైదరాబాద్‌లో లగ్జరీ విల్లా కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో కొత్త మార్పు కనిపిస్తోంది. కొన్ని ప్రీమియం ప్రాజెక్టుల్లో రాజకీయ నాయకులు నివసిస్తున్నారా? అనే ప్రశ్నలను కొనుగోలుదారులు అడుగుతున్నట్లు రియల్టర్ సతీష్ రెడ్డి సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించారు. రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద సందర్శకులు, కార్యకర్తల రాకపోకలు, బ్యానర్లు, పోస్టర్లతో ప్రశాంతతకు భంగం కలుగుతుందనే ఆందోళన దీనికి కారణంగా పేర్కొన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కమ్యూనిటీ నుంచి గండిపేట విల్లా ప్రాజెక్టుకు మారిన ఉదాహరణను కూడా ఆయన ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్‌లో ప్రీమియం కొనుగోలుదారులు ఇప్పుడు సౌకర్యాలతో పాటు ప్రైవసీ, ప్రశాంతత, పరిసరాల పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నారన్నది ఈ పరిణామం సూచిస్తోంది.

    Kishore Arepalli Avatar

  • RRR ఉత్తర భాగంపై కేంద్రం అభ్యంతరం.. అలైన్‌మెంట్‌పై కీలక సందిగ్ధత

    RRR ఉత్తర భాగంపై కేంద్రం అభ్యంతరం.. అలైన్‌మెంట్‌పై కీలక సందిగ్ధత

    తెలంగాణ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (RRR) ఉత్తర భాగానికి కేంద్ర అనుమతులు ఇంకా లభించకపోవడంతో ప్రాజెక్టు ముందడుగు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం 2024 డిసెంబర్‌, 2025 నవంబర్‌, 2026 మేలో మూడు సార్లు టెండర్లు పిలిచినా తుది ఆమోదం రాలేదు. అలైన్‌మెంట్‌ ఖరారైన సమయంలో భారీగా భూముల కొనుగోళ్లు జరిగాయంటూ ఫిర్యాదులు వచ్చినట్లు కేంద్రం తెలిపినట్లు సమాచారం. రాష్ట్రం ప్రకారం 90% భూసేకరణ పూర్తయింది. ప్రస్తుత అలైన్‌మెంట్‌తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమైతే మార్పులపై నిర్ణయం రావాల్సి ఉంటుంది. అలైన్‌మెంట్‌ చుట్టూ అనిశ్చితి కొనసాగితే సంబంధిత ప్రాంతాల్లో భూముల అభివృద్ధి, పెట్టుబడి నిర్ణయాలపై కూడా ప్రభావం ఉండొచ్చు.

    Kishore Arepalli Avatar

  • హైదరాబాద్‌లో రూ.50 కోట్లతో ఫాబియెనెస్ కొత్త ఫర్నిచర్ ప్లాంట్

    హైదరాబాద్‌లో రూ.50 కోట్లతో ఫాబియెనెస్ కొత్త ఫర్నిచర్ ప్లాంట్

    ప్రీమియం ఫర్నిచర్ బ్రాండ్ ఫాబియెనెస్ (Fabieness) హైదరాబాద్‌లో కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటుకు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. నగరంలో సుమారు 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆధునిక ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. కంపెనీ ఎండీ రాజ్ వేణుగోపాల్ వివరాల ప్రకారం.. వచ్చే ఏడాది కల్లా ప్లాంట్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా సుమారు 100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కటింగ్‌-ఎడ్జ్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ ఇంటీరియర్ డిజైన్, జర్మన్ మెషినరీతో ఫర్నిచర్ ఉత్పత్తి చేపట్టనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రూ.80 కోట్ల పెట్టుబడితో మరో ప్లాంట్ ఏర్పాటు చేసిన కంపెనీ, రోజుకు 3,500కు పైగా రెసిడెన్షియల్, కమర్షియల్, హాస్పిటాలిటీ రంగాల ప్రాజెక్టులకు ఫర్నిచర్ సొల్యూషన్స్ అందిస్తోంది.

    Sandhya B Avatar

  • ఖాళీ స్థలాలపై కబ్జాదారుల కన్ను.. నకిలీ రికార్డులతో మోసాలు

    ఖాళీ స్థలాలపై కబ్జాదారుల కన్ను.. నకిలీ రికార్డులతో మోసాలు

    నగరంలో పర్యవేక్షణ లేని ఖాళీ స్థలాలు కబ్జాదారులకు లక్ష్యంగా మారుతున్నాయి. యజమానులు అందుబాటులో లేని భూములను గుర్తించి నకిలీ పత్రాలు, రికార్డులు సృష్టించి విక్రయాలకు ప్రయత్నిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలపై అక్రమంగా హక్కులు చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి భూములను ఇతరులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో భూమి యజమానులు తమ స్థలాల పత్రాలు, రికార్డులను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

    Sandhya B Avatar

  • హైదరాబాద్‌లో ఇల్లు అమ్ముతానని నమ్మించి రూ.60 లక్షల మోసం

    హైదరాబాద్‌లో ఇల్లు అమ్ముతానని నమ్మించి రూ.60 లక్షల మోసం

    ఇల్లు అమ్ముతానని నమ్మించి తండ్రి, కుమార్తె నుంచి రూ.60 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 10 సమీపంలో నివసించే ఓ కుటుంబానికి చెందిన వ్యక్తికి, యూసఫ్‌గూడ ప్రాంతంలోని ఇల్లు విక్రయిస్తానని నిందితుడు హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో 2022 అక్టోబర్‌ నుంచి 2023 జనవరి మధ్య మూడు విడతల్లో రూ.60 లక్షలు చెల్లించారు. అనంతరం ఇంటి హక్కులకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తెలుసుకున్న బాధితులు ఒప్పందాన్ని రద్దు చేసి డబ్బు తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే నిందితుడు డబ్బు చెల్లించకుండా కాలయాపన చేయడంతో బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

    Sandhya B Avatar

  • పూడికతీత

    పూడికతీత

    ఫతేనగర్–బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో వరద ముప్పును తగ్గించేందుకు హైడ్రా భారీ స్థాయిలో నాలా పూడికతీత పనులు చేపట్టింది. దీన్‌దయాల్‌నగర్‌ నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పనుల్లో ఏళ్లుగా పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను ఎక్సకవేటర్లతో తొలగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 6–7 అడుగుల మేర పూడిక పేరుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. పూడికతో పాటు నాలా ఆక్రమణల కారణంగా నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గినట్లు హైడ్రా తెలిపింది. నాలా వెడల్పు కొన్ని చోట్ల గణనీయంగా తగ్గిపోవడంతో ఆక్రమణలను గుర్తించి తొలగించాలని కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ ఆదేశించారు. పారిశ్రామిక యూనిట్ల యజమానులతో సమావేశం నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోనున్నారు.

    Sandhya B Avatar

  • హైదరాబాద్‌లో కొలరాడో డెన్వర్‌ వర్సిటీ క్యాంపస్

    హైదరాబాద్‌లో కొలరాడో డెన్వర్‌ వర్సిటీ క్యాంపస్

    అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో డెన్వర్ హైదరాబాద్‌లో తన తొలి భారత క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్యాంపస్ ద్వారా భారతీయ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ఉన్నత విద్యను అందించే అవకాశం ఏర్పడనుంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతికత, మేనేజ్‌మెంట్, పరిశోధన, పరిశ్రమలకు అనుగుణమైన కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ ఇప్పటికే ఐటీ, విద్యా రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ క్యాంపస్ నగర విద్యా రంగానికి మరింత ఊతమివ్వనుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో అడుగుపెట్టడం ద్వారా విద్యార్థులకు విదేశాలకు వెళ్లకుండానే గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అవకాశాలు అందుబాటులోకి రావచ్చు.ఇప్పటికే యూకేకు చెందిన పలు విశ్వవిద్యాలయాలు భారత్‌లో విద్యా కార్యకలాపాలకు సిద్ధమవుతున్నాయి. మరో 11 విదేశీ వర్సిటీలకు కూడా ప్రాథమిక అనుమతులు లభించినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. దీంతో నగరంలో గ్లోబల్ ఎడ్యుకేషన్…

    Sandhya B Avatar

  • కోండాపూర్–నానక్‌రామ్‌గూడ కీలక ఐటీ కారిడార్‌గా..

    కోండాపూర్–నానక్‌రామ్‌గూడ కీలక ఐటీ కారిడార్‌గా..

    హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో కోండాపూర్–నానక్‌రామ్‌గూడ ఐటీ కారిడార్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. యాక్సెంచర్, ఉబర్, CIBC వంటి అంతర్జాతీయ సంస్థలు భారీ కార్యాలయ స్థలాలను లీజుకు తీసుకోవడంతో ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్నాయి. కోండాపూర్‌లో యాక్సెంచర్ సుమారు 10.17 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని, నానక్‌రామ్‌గూడలో ఉబర్ 9.01 లక్షల చదరపు అడుగులు, CIBC 1.21 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. దీంతో ఉద్యోగ అవకాశాలతో పాటు సమీప నివాస ప్రాంతాల్లో ఇళ్లకు, అద్దెకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కోండాపూర్‌లో ఫ్లాట్ల సగటు ధర చదరపు అడుగుకు సుమారు 10,200 కాగా, నానక్‌రామ్‌గూడలో 11,500 గా ఉంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్ ప్రాంతాల్లోనూ ధరలు పెరుగుతున్నాయి.

    Sandhya B Avatar

  • హైదరాబాద్‌లో రూ.500 కోట్ల ప్రీ-లాంచ్ మోసం ఆరోపణలు

    హైదరాబాద్‌లో రూ.500 కోట్ల ప్రీ-లాంచ్ మోసం ఆరోపణలు

    హైదరాబాద్‌ తెల్లాపూర్‌లో ప్రీ-లాంచ్ ఫ్లాట్ల పేరుతో రూ.500 కోట్ల మోసం జరిగిందంటూ త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై సుమారు 350 మంది బాధితులు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2021లో ‘త్రిపుర నిర్వాణ’ పేరుతో ప్రాజెక్టును ప్రకటించి, మార్కెట్‌ ధరల కంటే తక్కువకు ఫ్లాట్లు ఇస్తామని చెప్పి పెట్టుబడులు స్వీకరించినట్లు బాధితులు ఆరోపించారు. డబ్బులు చెల్లించి ఏళ్లు గడిచినా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని వారు తెలిపారు. సంస్థ ఫౌండర్‌-ఛైర్మన్‌ పసుపులేటి సుధాకర్‌తో పాటు ఇతరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాజెక్టు భూమిని మరో నిర్మాణ సంస్థకు విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలోనూ సీసీఎస్‌, సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగంలో ఫిర్యాదులు నమోదయ్యాయి. టీజీ-రెరాలోనూ సంస్థపై పలు ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం. రూ.500 కోట్ల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Sandhya B Avatar