పూడికతీత

HYDRAA drain desilting works

ఫతేనగర్–బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో వరద ముప్పును తగ్గించేందుకు హైడ్రా భారీ స్థాయిలో నాలా పూడికతీత పనులు చేపట్టింది. దీన్‌దయాల్‌నగర్‌ నుంచి సుమారు 3 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పనుల్లో ఏళ్లుగా పేరుకుపోయిన పూడిక, వ్యర్థాలను ఎక్సకవేటర్లతో తొలగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో 6–7 అడుగుల మేర పూడిక పేరుకుపోయినట్లు అధికారులు గుర్తించారు. పూడికతో పాటు నాలా ఆక్రమణల కారణంగా నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గినట్లు హైడ్రా తెలిపింది. నాలా వెడల్పు కొన్ని చోట్ల గణనీయంగా తగ్గిపోవడంతో ఆక్రమణలను గుర్తించి తొలగించాలని కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ ఆదేశించారు. పారిశ్రామిక యూనిట్ల యజమానులతో సమావేశం నిర్వహించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోనున్నారు.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar