ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు బిల్ట్-అప్ ఏరియా, ఫ్లోరింగ్, క్లబ్‌హౌస్ వంటి అంశాలకే చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. కానీ అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ (UDS) ఎంత ఉందో తప్పనిసరిగా తెలుసుకోవాలి. అపార్ట్మెంట్లోని మొత్తం భూమిపై ప్రతి ఫ్లాట్ యజమానికి ఉండే చట్టబద్ధమైన వాటానే UDS.హైరైజ్ ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల సంఖ్య పెరిగే కొద్దీ ఒక్కో ఫ్లాట్‌కు వచ్చే UDS తగ్గే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో భవనం పాతబడినప్పుడు లేదా రీడెవలప్మెంట్ జరిగినప్పుడు ఈ భూమి వాటా కీలకంగా మారుతుంది. అందుకే ఫ్లాట్ కొనుగోలు ముందు సర్వే నంబర్, మొత్తం భూమి విస్తీర్ణం, మీ పేరున ఉన్న UDS వివరాలను డాక్యుమెంట్లలో పరిశీలించడం అవసరం.












