బిల్డింగ్ అనుమతుల కోసం దాఖలైన పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. వివిధ కారణాలతో అనుమతులు నిలిచిపోయిన దరఖాస్తులపై టౌన్ ప్లానింగ్ డైరెక్టర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. అనుమతుల జారీలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పెద్దగా అభ్యంతరాలు లేని దరఖాస్తులను పరిశీలించి గురువారం లోగా అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు.












