పాత ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించాలి. ముందుగా ఆస్తి యాజమాన్య పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో చెక్ చేయాలి. ప్రాపర్టీపై రుణాలు, కోర్టు కేసులు లేదా ఇతర వివాదాలు ఉన్నాయా తెలుసుకోవాలి. భవనానికి సంబంధించిన అనుమతులు, నిర్మాణ నాణ్యత, భవనం వయస్సును పరిశీలించాలి. అలాగే పెండింగ్లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్, విద్యుత్, నీటి బిల్లులు ఉన్నాయా చెక్ చేయాలి. అపార్ట్మెంట్ అయితే అసోసియేషన్ బకాయిలు, మెయింటెనెన్స్ వివరాలు తెలుసుకోవాలి. భవిష్యత్లో వచ్చే రిపేర్ ఖర్చులను కూడా అంచనా వేయాలి. చివరగా అన్ని పత్రాలను న్యాయ నిపుణుడితో పరిశీలించిన తర్వాతే అడ్వాన్స్ చెల్లించడం లేదా రిజిస్ట్రేషన్ చేయడం మంచిది.












