రంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు బదలాయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారుల వివరాల ప్రకారం, ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని బొంగులూరు రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 96లో మొత్తం 4.36 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా ఉంది. అయితే 4.25 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల పేర్లపై పట్టా చేసినట్లు సమాచారం. ఈ భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమిని బదలాయించిన వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా పట్టా చేసిన అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.












