హైదరాబాద్‌లో 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్.. పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ వరకు!

Hyderabad 6-lane elevated corridor

హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రతిపాదించిన ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల ప్రణాళికను రద్దు చేసి, పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రతిపాదించింది.నాగార్జున సర్కిల్–ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ వరకు సుమారు 4.4 కిలోమీటర్ల పొడవున ఈ కారిడార్ నిర్మించే అవకాశం ఉంది. దీంతో పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వైపు వాహనదారులకు సిగ్నల్ రహిత ప్రయాణం సులభం కానుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1 వైపు ప్రత్యేక ర్యాంప్ కూడా ప్రతిపాదించారు. కొత్త డిజైన్, వ్యయ అంచనాలను త్వరలో సిద్ధం చేయనున్నారు.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar