నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో పారిశ్రామిక, లాజిస్టిక్స్ కార్యకలాపాలను పెంచేందుకు యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA) కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. టప్పల్–బజ్నా ప్రాంతంలో సుమారు 200 ఎకరాల్లో మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంచడం, ఆధునిక సప్లై చైన్ మౌలిక వసతులు అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. అలాగే ఎయిర్‌పోర్ట్‌కు దక్షిణంగా సుమారు 8,000 హెక్టార్లలో పారిశ్రామిక నోడ్ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయనున్నారు. ఇందులో ఫ్యాక్టరీలు, గిడ్డంగులు, లైట్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లకు అవకాశం కల్పించనున్నారు.












