ఫ్యూచర్ సిటీకి రాకపోకలు మరింత సులభతరం చేసేందుకు కొత్త రహదారి నిర్మాణం చేపడుతున్నారు. హైదరాబాద్–నాగార్జునసాగర్ హైవే నుంచి తక్కెళ్లపల్లి మీదుగా ఫ్యూచర్ సిటీ వరకు రెండు వరుసల రోడ్డు నిర్మిస్తున్నారు. తక్కెళ్లపల్లి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులకు ప్రభుత్వం దాదాపు రూ.30 కోట్లను కేటాయించినట్లు సమాచారం. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గంలో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు పరిసర గ్రామాలకు కూడా మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పారిశ్రామిక కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్ వృద్ధికి ఈ రహదారి కీలకంగా మారే అవకాశం ఉంది.












