భారత నగరాల్లో భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేపట్టే ముందు మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని CREDAI సూచించింది. కోల్‌కతాలో జరిగిన NATCON 2026 సదస్సులో CREDAI అధ్యక్షుడు శేఖర్ జి. పటేల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. రహదారులు, డ్రైనేజీ, ప్రజా రవాణా, ఇతర పౌర సదుపాయాలను ముందుగానే అభివృద్ధి చేస్తే నగరాల విస్తరణ మరింత ప్రణాళికాబద్ధంగా సాగుతుందని తెలిపారు.CREDAI నివేదిక ప్రకారం, భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025లో దాదాపు 600 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి ఇది 1 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా.












