కొత్త ఇల్లు నిర్మిస్తున్నారా? ఫ్లోరింగ్ కోసం టైల్స్, మార్బుల్, గ్రానైట్‌లో ఏది ఎంచుకోవాలో తెలుసుకోవాలి. ప్రస్తుతం తక్కువ బడ్జెట్‌లో మంచి లుక్ కోసం టైల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. గ్లాసీ, మ్యాట్, వుడ్‌గ్రెయిన్, స్టోన్ ఫినిష్ వంటి డిజైన్లు అందుబాటులో ఉన్నాయి. నాణ్యమైన టైల్స్ ధర చదరపు అడుగుకు సుమారు రూ.50–70 నుంచి ప్రారంభమవుతుంది. పెద్ద సైజు నానో, స్లాబ్ టైల్స్ ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి. తక్కువ జాయింట్లతో ఇవి మార్బుల్ తరహా రిచ్ లుక్ ఇస్తాయి. మార్బుల్ సహజమైన రాయి అయినప్పటికీ మరకలు, పాలిషింగ్, మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. గ్రానైట్ మన్నికైనది కాబట్టి కిచెన్ ప్లాట్‌ఫామ్‌లు, మెట్లు, బాల్కనీలు, పార్కింగ్‌కు అనుకూలం. బడ్జెట్, మన్నిక, నిర్వహణను పరిగణనలోకి తీసుకుంటే టైల్స్ మంచి ప్రాక్టికల్ ఎంపిక.












