హైదరాబాద్‌లో ఇల్లు అమ్ముతానని నమ్మించి రూ.60 లక్షల మోసం

Hyderabad house sale fraud

ఇల్లు అమ్ముతానని నమ్మించి తండ్రి, కుమార్తె నుంచి రూ.60 లక్షలు తీసుకుని మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 10 సమీపంలో నివసించే ఓ కుటుంబానికి చెందిన వ్యక్తికి, యూసఫ్‌గూడ ప్రాంతంలోని ఇల్లు విక్రయిస్తానని నిందితుడు హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో 2022 అక్టోబర్‌ నుంచి 2023 జనవరి మధ్య మూడు విడతల్లో రూ.60 లక్షలు చెల్లించారు. అనంతరం ఇంటి హక్కులకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తెలుసుకున్న బాధితులు ఒప్పందాన్ని రద్దు చేసి డబ్బు తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే నిందితుడు డబ్బు చెల్లించకుండా కాలయాపన చేయడంతో బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar