హైదరాబాద్‌లో రూ.50 కోట్లతో ఫాబియెనెస్ కొత్త ఫర్నిచర్ ప్లాంట్

Fabieness to invest Rs 50 crore

ప్రీమియం ఫర్నిచర్ బ్రాండ్ ఫాబియెనెస్ (Fabieness) హైదరాబాద్‌లో కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటుకు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. నగరంలో సుమారు 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆధునిక ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. కంపెనీ ఎండీ రాజ్ వేణుగోపాల్ వివరాల ప్రకారం.. వచ్చే ఏడాది కల్లా ప్లాంట్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా సుమారు 100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కటింగ్‌-ఎడ్జ్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ ఇంటీరియర్ డిజైన్, జర్మన్ మెషినరీతో ఫర్నిచర్ ఉత్పత్తి చేపట్టనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రూ.80 కోట్ల పెట్టుబడితో మరో ప్లాంట్ ఏర్పాటు చేసిన కంపెనీ, రోజుకు 3,500కు పైగా రెసిడెన్షియల్, కమర్షియల్, హాస్పిటాలిటీ రంగాల ప్రాజెక్టులకు ఫర్నిచర్ సొల్యూషన్స్ అందిస్తోంది.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar