చైనాలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుతోంది. 2026 తొలి 8 నెలల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి పెట్టుబడులు రికార్డు స్థాయిలో 19.9% తగ్గి 4.7979 ట్రిలియన్ యువాన్లకు చేరాయి. గృహ నిర్మాణ పెట్టుబడులు 19.7%, కొత్త నిర్మాణాలు 24.8%, పూర్తయిన ప్రాజెక్టులు 23.7% పడిపోయాయి. కొత్త ఇళ్ల విక్రయాలు 12.1% తగ్గగా, పాత ఇళ్ల లావాదేవీలు 10.6% పెరిగాయి. డెవలపర్ల నిధులు 21% క్షీణించడంతో చైనా హౌసింగ్ మార్కెట్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.












