చైనాలో కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ సంక్షోభం కారణంగా సావరిన్ వెల్త్ ఫండ్స్ (SWFs) అక్కడి పెట్టుబడులకు దూరంగా ఉంటున్నాయి. జపాన్‌కు చెందిన నిక్కీ నివేదిక ప్రకారం, మధ్యప్రాచ్య దేశాల పెట్టుబడి సంస్థలు అమెరికా వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నాయి.ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీలు మధ్యప్రాచ్య పెట్టుబడులను భారీగా ఆకర్షిస్తున్నాయి. దీంతో సావరిన్ వెల్త్ ఫండ్స్‌కు అమెరికా కీలక పెట్టుబడి గమ్యస్థానంగా మారుతోంది.చైనా రియల్ ఎస్టేట్ రంగంలోని సమస్యలు ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ విశ్వాసంపై ప్రభావం చూపుతుండటంతో ప్రభుత్వ మద్దతు ఉన్న పెట్టుబడిదారుల్లో అప్రమత్తత పెరిగింది. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ADIA) సహా పలు మధ్యప్రాచ్య సంస్థలు అమెరికాలో పెట్టుబడులను పెంచుతున్నాయి. స్థిరమైన రాబడులు, వృద్ధి అవకాశాల కోసం గ్లోబల్ ఇన్వెస్టర్లు వ్యూహాలను మార్చుకుంటున్నారు.












