ముంబై జుహులో ఏంజెల్ వన్ వ్యవస్థాపకుడు దినేష్ ఠక్కర్ భారీ విలాసవంతమైన నివాస ఆస్తిని కొనుగోలు చేయనున్నారు. జుహు తారా రోడ్డులోని ఈ మొత్తం రెసిడెన్షియల్ టవర్ విలువ రూ.711 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. 63,000 చదరపు అడుగుల RERA కార్పెట్ ఏరియాతో G+7 అంతస్తుల్లో ఈ టవర్ నిర్మాణం చేపట్టారు. చదరపు అడుగుకు సుమారు రూ.1.13 లక్షల చొప్పున ఈ లావాదేవీ జరగనుంది. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం ఐదు టవర్లు, 50 విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. రెండు ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మొత్తం గ్రాస్ డెవలప్మెంట్ విలువ రూ.3,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ముంబైలో అల్ట్రా-లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్‌కు ఈ డీల్ నిదర్శనంగా నిలుస్తోంది.












