ఢిల్లీ-NCRలో మౌలిక వసతుల అభివృద్ధి, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCCs) విస్తరణతో కొత్త రియల్ ఎస్టేట్ కారిడార్లు రూపుదిద్దుకుంటున్నాయి.
ద్వారకా ఎక్స్ప్రెస్వే, నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్వే, యమునా ఎక్స్ప్రెస్వే ప్రాంతాల్లో నివాస ప్రాజెక్టులతో పాటు ఆఫీసులు, రిటైల్, హాస్పిటాలిటీ, మిక్స్డ్-యూజ్ అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. జేవర్లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంతాల ఆర్థిక కార్యకలాపాలకు కొత్త ఊతమిస్తోంది.ముఖ్యంగా నోయిడా–గ్రేటర్ నోయిడాలో GCCలు, MNCలు విస్తరించడంతో ఉద్యోగాలు, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్నాయి. దీంతో NCRలో రియల్ ఎస్టేట్ వృద్ధి కేవలం గృహాలకే పరిమితం కాకుండా సమగ్ర పట్టణ అభివృద్ధి దిశగా సాగుతోంది.












