NH-65 విస్తరణకు టెండర్లు

NH-65 highway expansion

హైదరాబాద్‌–విజయవాడ–మచిలీపట్నం మధ్య కీలకమైన NH-65 జాతీయ రహదారి విస్తరణకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్‌–విజయవాడ మార్గంలో 181.30 కి.మీ మేర రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు NHAI టెండర్‌ పిలిచింది. ఈ ప్యాకేజీ అంచనా వ్యయం సుమారు రూ.6,792.52 కోట్లు కాగా, బిడ్ల దాఖలుకు నవంబర్‌ 23, 2026 వరకు గడువు ఉంది.అదేవిధంగా విజయవాడ–మచిలీపట్నం మధ్య 59.695 కి.మీ మేర NH-65ను ఆరు లేన్లుగా విస్తరించేందుకు మరో టెండర్‌ జారీ అయింది. ఈ పనుల అంచనా విలువ రూ.806.77 కోట్లు. బిడ్ల దాఖలుకు నవంబర్‌ 10 వరకు గడువు ఉంది.ఈ విస్తరణతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ, మచిలీపట్నం వరకు రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar