22A భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్

22A lands approval

హైదరాబాద్ పరిధిలో 22A జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ నుంచి అవసరమైన అనుమతులు పొందిన భూములను రిజిస్ట్రేషన్‌కు పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సంబంధిత అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 22A భూముల యజమానులు, కొనుగోలుదారులకు ఊరట లభించనుంది. రిజిస్ట్రేషన్లపై నెలకొన్న అనిశ్చితికి ఈ నిర్ణయంతో కొంతమేర పరిష్కారం లభించే అవకాశం ఉంది. తాజా ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar