విశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌.. చిరిపాల్ గ్రూప్‌కు నారా లోకేష్ ఆహ్వానం

Chiripal Group manufacturing unit Visakhapatnam

విశాఖపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని చిరిపాల్ గ్రూప్‌ను మంత్రి నారా లోకేష్ కోరారు. అహ్మదాబాద్‌లో చిరిపాల్ గ్రూప్ ఎండీ బ్రిజ్ మోహన్ చిరిపాల్, GREW Solar సీఈఓ వినయ్ థదానితో ఆయన సమావేశమయ్యారు. విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాలు, రహదారులు, మెరుగైన కనెక్టివిటీ, ప్రభుత్వ విధానపరమైన మద్దతు పారిశ్రామిక పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని లోకేష్ తెలిపారు. తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లో తమకు తయారీ యూనిట్లు ఉన్నాయని చిరిపాల్ గ్రూప్ తెలిపింది. తమ ఉత్పత్తులను 52కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు బ్రిజ్ మోహన్ చిరిపాల్ వెల్లడించారు. ఏపీలో టైర్ల యూనిట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar