వక్ఫ్ ఆస్తిగా భూమిని ప్రకటించినప్పుడు దానికి సంబంధించిన సర్వే, విచారణ రికార్డులను వక్ఫ్ బోర్డు సమర్పించాల్సిందే అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తూప్రాన్‌లోని సర్వే నంబర్లు 893, 894, 895, 896, 897 తదితర భూములను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. భూ యజమానులు పట్టాదారు పాస్‌బుక్‌లు, రెవెన్యూ రికార్డులు, టైటిల్ డీడ్లు ఉన్నాయని తెలిపారు. అయితే, వక్ఫ్ బోర్డు సర్వే, విచారణ, అభ్యంతరాలు, ప్రజలకు నోటీసులిచ్చినట్లు ఆధారాలను సమర్పించలేకపోయింది. దీంతో 2001 గెజిట్ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది.












