తెలంగాణ భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ విచారణ

Telangana land scam investigation

తెలంగాణలో భూ అక్రమాలు, అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 134 జారీ చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఏ. శ్రీదేవసేన చైర్‌పర్సన్‌గా, రాజీవ్‌గాంధీ హనుమంతు కన్వీనర్‌గా కమిటీని నియమించారు. వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ, అసైన్డ్‌, భూదాన్‌ భూముల వ్యవహారాలతో పాటు భూసేకరణ, పరిహారం, నిబంధనల ఉల్లంఘనలపై కమిటీ విచారణ చేయనుంది. అలాగే ధరణి మాడ్యూల్ దుర్వినియోగం, భూ రికార్డులలో అవకతవకలపై కూడా దృష్టి సారించనుంది. పలు ప్రాంతాల్లోని భూములపై వచ్చిన ఆరోపణలను పరిశీలించి, బాధ్యులను గుర్తించి చర్యలకు సిఫార్సులు చేయనుంది. అవసరమైన రికార్డులు, పత్రాలు, డేటాను సేకరించే అధికారాన్ని ప్రభుత్వం కమిటీకి ఇచ్చింది. త్వరితగతిన నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar