యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల విక్రయానికి హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ట్రిపుల్ ఆర్ పరిధిలోని భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, బొమ్మలరామారం, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో భూములను గుర్తిస్తున్నారు. ఆయా భూముల టైటిల్, కేటగిరీ, విస్తీర్ణం, ప్రస్తుత పరిస్థితిపై వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఒక్కో గ్రామంలో 150 నుంచి 200 ఎకరాల వరకు గుర్తించేలా కసరత్తు జరుగుతున్నట్టు కథనం పేర్కొంది. ఇప్పటివరకు వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు సమాచారం. భువనగిరి మండలం రాయగిరిలో 300 ఎకరాల భూమిని గుర్తించగా, ఇతర మండలాల్లోనూ భూముల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.












