అమరావతి వేగంగా భారతదేశంలోని ప్రముఖ విద్యా, నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. VIT-AP, SRM యూనివర్సిటీ, అమృత విశ్వ విద్యాపీఠం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.రాబోయే రోజుల్లో XLRI, BITS, IIULER, NIELIT, NVIDIAతో AI యూనివర్సిటీ/లివింగ్ ల్యాబ్స్, మణిపాల్ గ్రూప్ మీడియా యూనివర్సిటీ, CITD, సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్, KIMS, అమరావతి స్కూల్ ఆఫ్ బయోడిజైన్ వంటి సంస్థలు రానున్నాయి. వివిధ రంగాల్లో ప్రముఖ విద్యాసంస్థలు ఏర్పడటంతో అమరావతి విద్య, పరిశోధన, టెక్నాలజీ, ఉపాధి అవకాశాలకు కీలక కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది.












