అమరావతి రాజధాని ప్రాంతానికి కీలకమైన ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాజెక్టుకు మాస్టర్‌ప్లాన్ సిద్ధమైంది. మొత్తం 189.93 కి.మీ. పొడవుతో ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించనున్నారు. సుమారు రూ.30,491 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా చేపట్టనున్నారు.ORRలో మూడు సొరంగాలు, కృష్ణా నదిపై రెండు భారీ వంతెనలు నిర్మించనున్నారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో 2.68, 1.64 కి.మీ. సొరంగాలు, పేరేచర్ల వద్ద 400 మీటర్ల సొరంగం ఏర్పాటు కానుంది. అలాగే 4.8 కి.మీ., 3.15 కి.మీ. కృష్ణా వంతెనలు నిర్మించనున్నారు.
ORR పూర్తయితే విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీతో పాటు సరకు రవాణా, లాజిస్టిక్స్‌కు ప్రయోజనం కలగనుంది.












