అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాజెక్టులో NHAI కీలక మార్పులు చేసింది. 189.93 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో ఇంటర్‌ఛేంజ్‌ల సంఖ్యను 19 నుంచి 17కు తగ్గించారు.అలాగే తెనాలి సమీపం నుంచి కాజ వరకు ప్రతిపాదించిన 17.5 కిలోమీటర్ల అనుసంధాన రహదారిని పక్కన పెట్టారు. ORRకు ఒకవైపు మాత్రమే సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేసేలా డిజైన్‌లో మార్పులు చేశారు. దీంతో భూసేకరణ, నిర్మాణ వ్యయాలు తగ్గనున్నాయి.ఈ మార్పులతో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,450 కోట్ల నుంచి రూ.30,491 కోట్లకు తగ్గింది. అంటే మొత్తం రూ.7,959 కోట్ల వ్యయం తగ్గింది.ORRలో కంచికచర్ల, మైలవరం, పొట్టిపాడు తదితర ప్రాంతాల్లో వివిధ రకాల ఇంటర్‌ఛేంజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతి, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల రహదారి కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.












