బంజారాహిల్స్‌లో రెసిడెన్షియల్ భవనంలో కమర్షియల్ షోరూమ్?

banjarahills_residencial_apartment

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో రెసిడెన్షియల్ అనుమతులతో నిర్మించిన భవనంలో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వెలువడ్డాయి. రోడ్ నంబర్ 7లోని ఓ భవనానికి 2023లో జీహెచ్ఎంసీ బిల్డింగ్ పర్మిట్, 2025లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ అయ్యాయి. అధికారిక రికార్డుల ప్రకారం భవన వినియోగం ‘రెసిడెన్షియల్’గా ఉంది. అయితే అదే భవనంలో క్లాత్స్ షోరూమ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. భవనాన్ని తనిఖీ చేసి నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar