ఢిల్లీలో 2001కి ముందు నిర్మాణ అనుమతులు పొందిన ఎత్తైన భవనాలకు స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ తప్పనిసరి చేస్తూ ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) ఆదేశాలు జారీ చేసింది. 15 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తున్న భవనాలు మూడు నెలల్లోగా ఆడిట్ పూర్తి చేయాలి. మాల్స్, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, గ్రూప్ హౌసింగ్, ఇతర సంస్థాగత భవనాలు కూడా ఈ నిబంధన పరిధిలోకి వస్తాయి. 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తున్నప్పటికీ అధికంగా ప్రజలు వచ్చే పాత భవనాలకు కూడా ఆడిట్ తప్పనిసరి. అవసరమైతే యజమానులు రిట్రోఫిట్టింగ్, ఇతర సరిదిద్దే చర్యలు చేపట్టాలి. ఆడిట్ ఖర్చును యజమానులు లేదా ఆక్యుపెంట్లు భరించాలి. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని DDA హెచ్చరించింది.












