ఫార్చ్యూన్ 99 హోమ్స్ నిర్వాహకుడు అరెస్ట్.. నకిలీ పత్రాలతో ప్లాట్ల మోసం

Fortune 99 Homes

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఫార్చ్యూన్ 99 హోమ్స్ నిర్వాహకుడు మదిరాల రోసిరెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జడ్చర్లలోని ఓ వెంచర్‌లో ప్లాట్ ఇప్పిస్తానని ఓ వ్యక్తిని నమ్మించి, రూ.25 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. అనంతరం ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా రోజులు గడుపుతూ బాధితుడిని మభ్యపెట్టాడు. అనుమానం వచ్చిన బాధితుడు పత్రాలను పరిశీలించగా, సదరు ప్లాట్‌పై రోసిరెడ్డికి ఎలాంటి యాజమాన్య హక్కులు లేవని, చూపించిన డాక్యుమెంట్లు నకిలీవని గుర్తించాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతో రోసిరెడ్డి కార్యాలయానికి తాళం వేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో అతడిని పట్టుకున్నారు. గతంలోనూ అతడిపై పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar