హైదరాబాద్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు (GCC) కీలక హబ్‌గా మరింత బలోపేతమవుతోంది. జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తమ గ్లోబల్ కార్యకలాపాల కోసం హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సంస్థ బిల్ట్రస్ట్ హైదరాబాద్‌లో కొత్త గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. మాదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్‌లో సుమారు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.450 కోట్ల పెట్టుబడి అంచనాతో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దీనిని ప్రారంభించారు. హైదరాబాద్‌లో గతేడాది 75కు పైగా కొత్త GCCలు ప్రారంభమయ్యాయని, గ్లోబల్ ఆపరేషన్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో నగరం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.ఈ సెంటర్‌లో దశలవారీగా వెయ్యి మందికి ఉపాధి లభించనుందన్నారు.












