హైదరాబాద్ మెట్రోకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మెట్రో ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియను దసరా నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. మెట్రో నిర్వహణ, ఆస్తులు, బాధ్యతలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతోంది. ఫేజ్-1 టేకోవర్ పూర్తయితే హైదరాబాద్ మెట్రో నిర్వహణలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. నగర ప్రజలకు మెరుగైన మెట్రో సేవలు అందించడంతో పాటు భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు ఇది దోహదపడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.












