హైదరాబాద్‌లో మళ్లీ ఊపందుకున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు

Hyderabad property registrations

హైదరాబాద్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. 22-A నిషేధిత జాబితాలో ఉన్న ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో 40 రోజుల మందగమనానికి తెరపడింది. రాజేంద్రనగర్, గండిపేట్, మొజాంజాహీ మార్కెట్, చాంపాపేట్, కీసర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. ఆస్తులపై 22-A జాబితా ప్రభావం ఉందా అనే వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. సేల్ అగ్రిమెంట్ల సంఖ్య కూడా పెరిగిందని డాక్యుమెంట్ రైటర్లు తెలిపారు. పితృపక్షం ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు పెరగడం గమనార్హం. అక్టోబర్ 11 నుంచి నవరాత్రులు ప్రారంభం కానుండటంతో దసరా సమయంలో హైదరాబాద్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు, సిబ్బంది చెబుతున్నారు.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar