హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ తగ్గుతున్నప్పటికీ ఇళ్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయి. క్రెడాయ్–క్రెమెట్రిక్స్ తాజా నివేదిక ప్రకారం, గత నాలుగేళ్లలో హైదరాబాద్లో నివాస గృహాల అమ్మకాలు 13 శాతం తగ్గాయి. అయితే సగటు ఇంటి ధర రూ.2 కోట్ల మార్కును దాటింది. ఐటీ రంగంలోని ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఎన్ఆర్ఐ పెట్టుబడిదారుల వేచి చూసే ధోరణి వంటి అంశాలు కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు భూముల ధరలు, నిర్మాణ వ్యయాలు పెరగడంతో ఇళ్ల ధరలు తగ్గడం లేదు. దీంతో హైదరాబాద్లో సొంతింటి కొనుగోలు మరింత ఖరీదుగా మారుతోంది.












