భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో భూమి లావాదేవీలు భారీగా పెరిగాయి. 2021 జనవరి నుంచి 2026 మార్చి వరకు దేశవ్యాప్తంగా 7,714 ఎకరాల భూమి నివాస ప్రాజెక్టుల కోసం లావాదేవీ అయినట్లు కుష్‌మన్ & వేక్‌ఫీల్డ్ నివేదిక వెల్లడించింది. మొత్తం 33 నగరాల్లో 880కు పైగా భూ ఒప్పందాలు జరిగాయి. బలమైన గృహ డిమాండ్ కారణంగా రియల్ ఎస్టేట్ సంస్థలు తమ ప్రాజెక్టులను విస్తరిస్తున్నాయి. మొత్తం 18,158 ఎకరాల భూమి వివిధ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం లావాదేవీ కాగా, నివాస రంగం ప్రధాన వాటాను దక్కించుకుంది.












