హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి హౌసింగ్ బోర్డు టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో టెండర్లు పిలిచిన అధికారులు తాజాగా ఎల్బీనగర్, ముషీరాబాద్, గోషామహల్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు కూడా టెండర్లు పిలిచారు. ఒక్కో నియోజకవర్గంలో 480 ఫ్లాట్ల చొప్పున నిర్మించనున్నారు. ఒక్కో ప్రాజెక్టుకు సుమారు రూ.43.20 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించారు. ఈ టెండర్ల దాఖలుకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 22 వరకు అవకాశం కల్పించారు. మరోవైపు, పాటిగడ్డలో 480 ఫ్లాట్లు, బోయినపల్లిలో 140 ఫ్లాట్ల నిర్మాణానికి రూ.55.80 కోట్ల అంచనా వ్యయంతో హౌసింగ్ బోర్డు మరోసారి టెండర్లు పిలిచింది. వీటికి అక్టోబర్ 10 వరకు గడువు ఉంది.












