కడప విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రూ.266 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం 70 శాతం పూర్తయ్యాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఆధునిక టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లను 2023 అక్టోబర్‌లో ఆహ్వానించారు. 2024 మార్చి 10న శంకుస్థాపన జరగగా, ఏప్రిల్ 2024లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే కడప విమానాశ్రయంలో ప్రయాణికుల సౌకర్యాలు, మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయి.












