కరీంనగర్‌లో రిజిస్ట్రేషన్ పేరుతో మోసం.. రూ.29 లక్షలు కాజేసిన వ్యక్తి

karimnagar scam

కరీంనగర్‌లో భూమి రిజిస్ట్రేషన్ పేరుతో ఓ మహిళను మోసం చేసి రూ.29 లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తబస్సుమ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. శనిగరం శివారులోని 7 గుంటల భూమిని రూ.29 లక్షలకు విక్రయిస్తానని కృష్ణగిరికి చెందిన మహమ్మద్ అలీఫ్ 2025 డిసెంబర్ 23న తబస్సుమ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. రూ.5 లక్షలను అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. అనంతరం 2026 జూలై 14న తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి ఆమెను రప్పించాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని నమ్మించి మిగిలిన రూ.24 లక్షలు కూడా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మోసం జరిగినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar