కుప్పంలో కొత్త పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులకు భారీ పెట్టుబడులు రానున్నాయి. ఏపీ సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు సమక్షంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) పలు సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది. మనస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌తో పాటు కింబర్లైట్ కెమికల్స్ రూ.70 కోట్లు, నూట్రాజెనిక్ రూ.350 కోట్లు, పయనీర్ ఎక్స్ట్రాక్ట్స్ రూ.67 కోట్లు, ఎంగమ్ డెయిరీ ఫుడ్స్ రూ.150 కోట్లు, ప్లాంటెస్ హెల్త్‌కేర్ రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. మొత్తంగా రూ.662 కోట్ల పెట్టుబడులతో వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. కెమికల్స్, హెర్బల్ ఉత్పత్తులు, బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్‌కేర్, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో పెట్టుబడులతో కుప్పం వైవిధ్యమైన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది.












