మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. 2028 నాటికి విమాన సర్వీసులు ప్రారంభించాలనే లక్ష్యంతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పనులను వేగవంతం చేస్తోంది. రన్‌వే ఆధునికీకరణ, పార్కింగ్, ట్యాక్సీవేలు, రహదారులు వంటి పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. తాజాగా నూతన డొమెస్టిక్ టెర్మినల్, ఏటీసీ టవర్, ఫైర్ స్టేషన్, విద్యుత్ సబ్‌స్టేషన్ తదితర మౌలిక వసతుల కోసం మరో టెండర్ ప్రక్రియ చేపట్టారు. డిసెంబరులో శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు విమాన కనెక్టివిటీ మెరుగుపడటంతోపాటు వరంగల్‌లో పెట్టుబడులు, పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలకు ఊతం లభించనుంది.












