హైద‌రాబాద్‌కు నార్త్‌లో మ‌రో మోకిలా ర‌డీ అవుతోంది.. అభివృద్ధికి పుష్క‌ల‌మైన అవ‌కాశాలు

Manoharabad Hyderabad North real estate

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో కొత్త ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. నగరానికి ఉత్తర దిశలోని మనోహరాబాద్‌ కూడా భవిష్యత్‌లో మరో మోకిలాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెరుగైన రవాణా సౌకర్యాలు, పెరుగుతున్న మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి, హైదరాబాద్‌కు మెరుగైన కనెక్టివిటీ వంటి అంశాలు ఈ ప్రాంతం రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి కీలకంగా మారుతున్నాయి.తక్కువ ధరల్లో భూములు, ప్లాట్లు అందుబాటులో ఉండటంతో పెట్టుబడిదారులు, గృహ కొనుగోలుదారుల దృష్టి మనోహరాబాద్‌పై పడుతోంది. భవిష్యత్‌లో రహదారులు, పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు మరింత విస్తరిస్తే ఈ ప్రాంతంలో భూముల ధరలు, నివాస డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌ నార్త్‌ రియల్‌ ఎస్టేట్‌లో మనోహరాబాద్‌ కీలక హాట్‌స్పాట్‌గా ఎదిగే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar