ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కే రహేజా కార్ప్ చైర్మన్, బిలియనీర్ చంద్రు రహేజా మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ REITలో తన వాటాలో 1.49 శాతాన్ని విక్రయించారు. బీఎస్ఈలో జరిగిన బల్క్ డీల్ ద్వారా 99,00,990 యూనిట్లను విక్రయించగా, ఈ లావాదేవీ విలువ దాదాపు రూ.500 కోట్లుగా ఉంది. ఒక్కో యూనిట్‌ను సగటున రూ.505 ధరకు విక్రయించినట్లు ఎక్స్ఛేంజ్ డేటా వెల్లడించింది. ఈ విక్రయం అనంతరం మైండ్‌స్పేస్ REIT యూనిట్ ధర స్వల్పంగా 0.18 శాతం తగ్గి రూ.504.05 వద్ద ట్రేడైంది.












