నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో యమునా ఎక్స్ప్రెస్వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ (YEIDA) 19 ఇన్స్టిట్యూషనల్ ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 10 ప్లాట్లు పాఠశాలలకు, 9 ప్లాట్లు కార్పొరేట్ కార్యాలయాలకు కేటాయించారు.సెక్టార్ 17, 18, 20, 22Eలో స్కూల్ ప్లాట్లు ఉన్నాయి. వీటి పరిమాణం 8,000 నుంచి 14,100 చదరపు మీటర్ల వరకు, రిజర్వ్ ధర రూ.14.22 కోట్ల నుంచి రూ.23.41 కోట్ల వరకు ఉంది. సెక్టార్ 22Eలోని 9 కార్పొరేట్ ప్లాట్లు ఒక్కొక్కటి 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటి రిజర్వ్ ధర రూ.5.44 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఉంది.అప్లికేషన్లకు చివరి తేదీ: అక్టోబర్ 16. స్కూల్ ప్లాట్ల ఈ-వేలం నవంబర్ 20న, కార్పొరేట్ ప్లాట్ల వేలం నవంబర్ 23న జరగనుంది.












