ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పూర్తయిందంటే ఆ ఆస్తిపై యాజమాన్య హక్కు పూర్తిగా నిర్ధారించబడినట్టేనా? తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పులు దీనిపై స్పష్టత ఇచ్చాయి. కేవలం సేల్ డీడ్ రిజిస్టర్ చేయడం వల్ల కొనుగోలుదారుడికి చట్టబద్ధమైన టైటిల్ లభించదని కోర్టు పేర్కొంది.K. Gopi వర్సెస్ Sub-Registrar కేసులో సబ్-రిజిస్ట్రార్ ఒక పరిపాలనా అధికారి మాత్రమేనని, ఆస్తి యాజమాన్యంపై తుది నిర్ణయం తీసుకునే సివిల్ కోర్టు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విక్రేతకు ఆస్తిపై చట్టబద్ధమైన హక్కు లేకపోతే, అతను రిజిస్టర్ చేసిన సేల్ డీడ్ ద్వారా కొనుగోలుదారుడికి మెరుగైన హక్కును బదిలీ చేయలేడు.మరోవైపు Mahnoor Fatima Imran వర్సెస్ Visweswara Infrastructure కేసులో, ఆస్తి టైటిల్ చైన్లో మొదట్లోనే లోపం ఉంటే, తరువాత ఎన్ని రిజిస్టర్డ్ సేల్ డీడ్లు జరిగినా ఆ లోపం తొలగిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది.అందువల్ల ఆస్తి కొనుగోలు చేసే ముందు కేవలం రిజిస్ట్రేషన్ పత్రాలను చూడటం సరిపోదు. మూల టైటిల్, పాత పత్రాలు, పూర్తి టైటిల్ చైన్, భూమి హక్కులు, ప్రభుత్వ రికార్డులు వంటి అంశాలను న్యాయ నిపుణులతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిది.












