నార్త్ఈస్ట్ రాష్ట్రాలకు మెరుగైన రహదారి కనెక్టివిటీ కల్పించేందుకు కేంద్రం భారీ హైవే ప్రాజెక్ట్ చేపట్టనుంది. కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.61,500 కోట్ల అంచనా వ్యయంతో 630 కి.మీ హైవే కారిడార్ నిర్మించనున్నారు. ఇది పశ్చిమ బెంగాల్లోని సిలిగురిని అసోంలోని గువాహటి, మేఘాలయలోని షిల్లాంగ్తో అనుసంధానిస్తుంది.సిలిగురి–గువాహటి 400 కి.మీ మార్గానికి సుమారు రూ.30,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే గువాహటి–షిల్లాంగ్, షిల్లాంగ్–సిల్చార్ మార్గాలను అభివృద్ధి చేయనున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నుంచి సిలిగురి వరకు ఎక్స్ప్రెస్వే ప్రాజెక్ట్ కూడా చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులతో యూపీ–నార్త్ఈస్ట్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.












