22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

22A_Lands

తెలంగాణలో 22ఏ భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులు ఉన్న లేఅవుట్లు, ఆస్తులకు సంబంధించి పెండింగ్ రిజిస్ట్రేషన్ల పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 22ఏ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అంశంపై అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. మరోవైపు, 22ఏ నిషేధిత జాబితాలో ప్రైవేటు భూముల చేర్పుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్వతంత్ర విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar