22-A నిషేధిత జాబితాపై NHRC కీలక ఆదేశాలు

22-A prohibited land NHRC investigation

తెలంగాణలో 22-A నిషేధిత జాబితాలో ప్రైవేట్ ఆస్తులను చేర్చిన అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ఆస్తుల చేర్పుపై స్వతంత్ర విచారణ చేపట్టి, బాధితులకు తక్షణ ఉపశమనం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది సెప్టెంబర్ 14న చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. 22-A జాబితాలో భూములు చేర్చడం వల్ల వాటి విక్రయం, తనఖా వంటి లావాదేవీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని NHRC ఆదేశించింది.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar