తెలంగాణలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) పరిధిలో ఉన్న భూములు, కాలనీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న ULC కేసులు, క్రమబద్ధీకరణ దరఖాస్తులను పరిశీలించి క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల ULC భూముల్లో నివసిస్తున్న ప్రజలకు యాజమాన్య హక్కులు, ఆస్తుల లావాదేవీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంతో ఆయా కాలనీల్లో ఆస్తులపై స్పష్టత పెరగడంతో పాటు రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఊతం లభించే అవకాశం ఉంది.












