హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలకు TG-RERA కీలక మార్గదర్శకాలు

TG-RERA new maintenance rules

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లలో మెయింటెనెన్స్ ఛార్జీలపై వివాదాలకు చెక్ పెట్టేలా TG-RERA కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పూర్తై Occupancy Certificate పొందిన తర్వాత లేదా మెజారిటీ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయిన వెంటనే నిర్వహణ బాధ్యతలను రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌ (RWA)కు అప్పగించాలని స్పష్టం చేసింది. హ్యాండోవర్ పూర్తయ్యే వరకు మాత్రమే ఒప్పందం ప్రకారం బిల్డర్ మెయింటెనెన్స్ వసూలు చేయాలి. RWA ఏర్పాటైన తర్వాత అదనపు ఛార్జీలు విధించరాదు. అలాగే కార్పస్ ఫండ్ వివరాలు, మూడేళ్ల మెయింటెనెన్స్ ఆడిట్ నివేదికలను కొనుగోలుదారుల సంఘానికి అప్పగించాలి. అనుమతి లేని లేఅవుట్లు, TG-RERA రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టుల విక్రయాలపై జరిమానాలు, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని RERA హెచ్చరించింది.

మరిన్ని సంబంధిత వార్తలు

Sandhya B Avatar