నగర శివార్లు, ప్రధాన రహదారుల వెంట విల్లా ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతోంది. మెరుగైన రహదారి సదుపాయాలు, కొత్త మౌలిక వసతుల అభివృద్ధి, ఐటీ కారిడార్ల విస్తరణతో పలు ప్రాంతాల్లో విల్లా ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణంతో పాటు నగరానికి సులభమైన రాకపోకలు ఉండే ప్రాంతాలను కొనుగోలుదారులు ఎంచుకుంటున్నారు. ప్రభుత్వం చేపడుతున్న రోడ్లు, కనెక్టివిటీ, మౌలిక వసతుల పనులు రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో విల్లా ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో భూముల విలువలు, డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












